Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార‌త్-న్యూజిలాండ్ మ్యాచుకు వ‌చ్చిన ఓ జంట‌ ఫొటో, వీడియో వైర‌ల్

10 Hilarious Memes On Kanpur Fans Viral Image
  • అబ్బాయి నోటి నిండా గుట్కా
  • ఫోనులో మాట్లాడిన యువ‌కుడు
  • అత‌డిని అమాయ‌కంగా చూసిన అమ్మాయి
  • విప‌రీతంగా మీమ్స్ సృష్టిస్తోన్న నెటిజ‌న్లు
కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జ‌రుగుతోన్న భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచుకు వ‌చ్చిన‌ ఓ జంట ఫొటో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఇందులో ఓ యువ‌కుడు గుట్కా తింటుండ‌గా, అత‌డి ప‌క్క‌నే కూర్చున్న ఓ అమ్మాయి అత‌డిని త‌దేకంగా చూసింది.
         
నోటి నిండా గుట్కాతో, చేతిలో స్మార్ట్ ఫోన్ ప‌ట్టుకుని చెవి ద‌గ్గ‌ర పెట్టుకుని అత‌డు క‌ళ్లు మూసుకుని మాట్లాడుతున్నాడు. అత‌డిని ఓ అమ్మాయి అమాయ‌కంగా చూస్తోంది. మ‌రో గుట్కా తీసుకుర‌మ్మ‌ని అత‌డు త‌న స్నేహితుల‌కు చెబుతున్నాడ‌ని కొంద‌రు జోకులు వేస్తున్నారు. ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఒక‌రు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

పొగాకు, పాన్ మ‌సాలాకు సంబంధించిన యాడ్‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, వాటిల్లో న‌టించిన సినీన‌టుల‌ ఫొటోల‌ను జోడిస్తూ నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఓ మీమ్‌ను ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. బాలీవుడ్ సినిమాల్లోని డైలాగుల‌ను కూడా ఫ‌న్నీగా జోడిస్తూ నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తున్నారు.

Cricket
memes
Viral Pics

More Telugu News